లాక్ డౌన్ సడలింపులు.. అనంతపురం ‘కియా’లో కార్ల ఉత్పత్తి ప్రారంభం
- పెనుకొండలో ఉన్న కియా మోటార్స్ కార్ల పరిశ్రమ
- ఏడు వందల మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించాం
- ఈ మేరకు కంపెనీ వర్గాల ప్రకటన
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వెసులుబాటు లభించడంతో అనంతపురం కియా పరిశ్రమలో కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. పెనుకొండ మండలంలో ఉన్న కియా మోటార్స్ కార్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 7 నుంచి, ఏడు వందల మందితో ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది.
కాగా, లాక్ డౌన్ అనంతరం మార్చి 25వ తేదీన ఈ సంస్థ మూతపడింది. దాదాపు 42 రోజుల పాటు కంపెనీలో ఉత్పత్తి ఆగిపోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో తమ ఉద్యోగాలు పోతాయని కార్మికులు భావించారు. కానీ, తిరిగి ఉత్పత్తి ప్రారంభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.