తెరచుకోనున్న శ్రీకాళహస్తి... థర్మల్ స్క్రీనింగ్, మార్కింగ్ రింగ్స్ ఏర్పాటు!
- దాదాపు రెండు నెలలుగా ఆలయాల మూత
- డిజిన్ఫెక్షన్ టన్నెల్, శానిటైజర్ స్టాండ్ల ఏర్పాటు
- అనుమతి రాగానే భక్తులకు ప్రవేశం కల్పిస్తామన్న ఈఓ
దాదాపు రెండు నెలలకు పైగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడగా, చిత్తూరు జిల్లాలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో లాక్ డౌన్ తరువాత దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయంలో భక్తులు నిలబడేందుకు మార్కింగ్ రింగ్స్ ఏర్పాటు చేశారు.
లాక్ డౌన్ నుంచి మినహాయింపు రాగానే, భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసిన ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు ధర్మల్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అందరూ మాస్క్ లు ధరించి రావాలని, శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయని అన్నారు. ఆలయంలోకి వచ్చే భక్తులను ముందుగా డిజిన్ఫెక్షన్ టన్నెల్ లోకి పంపిస్తామని తెలిపారు. రాహుకేతు పూజలకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఒక పూజా టికెట్ కు ఒక పీట, ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.