పోలీసు శుభశ్రీ సేవలకు చలించిపోయిన చిరు.. వీడియో కాల్‌ చేసి మరీ మాట్లాడిన మెగాస్టార్‌.. వీడియో ఇదిగో!

  • లాక్‌డౌన్‌ వల్ల ఆకలితో అలమటిస్తోన్న ఓ మతి స్థిమితం లేని మహిళ
  • స్వయంగా అన్నం తినిపించిన ఒడిశా మహిళా పోలీసు
  • సర్వత్రా ప్రశంసల జల్లు
  • అభినందించిన చిరు
లాక్‌డౌన్‌ వల్ల ఆకలితో అలమటిస్తోన్న ఓ మతి స్థిమితం లేని మహిళకి స్వయంగా అన్నం తినిపించిన ఒడిశా మహిళా పోలీసు శుభశ్రీకి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వీడియో చూసిన మెగాస్టార్ చిరంజీవి ఆమెతో వీడియోలో మాట్లాడారు. ఆమెను అభినందించి, అందరికీ స్ఫూర్తివంతంగా నిలిచారని చెప్పారు.

వారి మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే..

చిరంజీవి: గుడ్ మార్నింగ్ శుభశ్రీ జీ

శుభశ్రీ: సర్ నమస్తే సర్

చిరు: నమస్తే నమస్తే.. ఆ శుభశ్రీ జీ.. కొన్ని రోజుల క్రితం మీ వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది.. అందులో మీరు ఓ మతి స్థిమితం లేని మహిళకి భోజనం తినిపిస్తున్నారు. అది నా మనసుని తాకింది. నన్ను చలింపజేసింది. ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నాను. మీరు ఆ వ్యక్తి పట్ల అంత ఆదరణగా, మానవీయంగా ఉన్నందుకు  చాలా సంతోషించాను. ఎంతో బాధ్యతగా మీరు ఈ పని చేయడానికి కారణమేంటీ?

శుభశ్రీ: నేను ఆవిడకి ప్రత్యేకించి ఏమీ చేయలేదు సర్... నేను భోజనం అందించినప్పుడు ఆవిడ తినే పరిస్థితుల్లో లేదు. దీంతో నేను ఆమెకు తినిపించాను.

చిరంజీవి: మీరు చాలా మందికి స్ఫూర్తివంతంగా నిలిచారు.

శుభశ్రీ: బాధ్యతలు నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్‌ కాపాడడం మాత్రమే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. మీరు నాతో మాట్లాడుతుండడంతో నేను ఎంతో ఉత్తేజం పొందుతున్నాను. మీరు మెగాస్టార్ మాత్రమే కాదు.. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

శుభశ్రీ, చిరు మధ్య జరిగిన పూర్తి సంభాషణ ఇదిగో...


More Telugu News