కొంతమంది జూనియర్ సింగర్స్ నన్ను ఎగతాళి చేశారు: గాయని సునీత
- కొంతమంది అలా ప్రచారం చేశారు
- కొన్ని వెబ్ సైట్లు లేనిపోనివి రాశాయి
- ధైర్యంతోనే ఇక్కడి వరకూ వచ్చానన్న సునీత
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీతకి మంచి పేరు వుంది. మెలోడీ గీతాలను మరింత మధురంగా పాడటం ఆమె ప్రత్యేకత. అలాంటి సునీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.
"వ్యక్తిగతంగా .. వృత్తిపరంగా జీవితం నా ముందుకు కొన్ని సవాళ్లను విసిరింది. వాటిని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగుతున్నాను. కొంతమంది జూనియర్ సింగర్స్ నన్ను ఇమిటేట్ చేస్తూ ఎగతాళి చేయడం నాకు చాలా బాధను కలిగించింది. నాతో సన్నిహితంగా ఉంటూ వచ్చినవారే నా గురించి బయట మరోలా ప్రచారం చేశారు. వాళ్లు ఎందుకు అలా చేశారనేది నాకు ఇప్పటికీ అర్థంకాని ప్రశ్న మాదిరిగానే మిగిలిపోయింది. కొన్ని వెబ్ సైట్లు నా గురించి లేనిపోనివి రాశాయి .. అందువలన వాళ్లకి ఒరిగిందేమిటనేది కూడా నాకు అర్థం కాలేదు. జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనను ఒక పాఠంగా భావించడం .. ఒక అనుభవంగా స్వీకరించడం అలవాటు చేసుకున్నాను. అందువల్లనే ఇక్కడి వరకూ రాగలిగాను" అని చెప్పుకొచ్చారు.