కన్నీళ్లు పెట్టించే సాయిపల్లవి పాత్ర!

కన్నీళ్లు పెట్టించే సాయిపల్లవి పాత్ర!
  • సహజ నటిగా సాయిపల్లవికి క్రేజ్
  • తాజా చిత్రంగా రూపొందుతున్న 'విరాటపర్వం'
  • మిగిలివున్న రానా పోర్షన్ షూటింగ్      
జయసుధ .. సౌందర్య తరువాత ఆ స్థాయిలో సహజమైన నటనను కనబరిచే కథానాయికలలో సాయిపల్లవి ముందువరుసలో కనిపిస్తుంది. చలాకీగా కనిపించే పాత్రలలోను .. కన్నీళ్లు పెట్టించే పాత్రల్లోను మెప్పించడం ఆమె ప్రత్యేకత. అలాంటి సాయిపల్లవి తాజా చిత్రంగా 'విరాటపర్వం' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ గా కనిపించనుంది. ఇటీవల వదిలిన ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంది.

సాయిపల్లవి ఎందుకు నక్సలైట్ గా మారవలసి వచ్చింది? నక్సలైట్ గా మారిన ఆమె చివరికి సాధించినది ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. తాను అనుకున్నది సాధించే క్రమంలో ఆమె తన ప్రాణాలను కూడా కోల్పోతుందని చెబుతున్నారు. ఆ సన్నివేశంలో ఆమె ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. సినిమా అంతటికి ఆ సన్నివేశం హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. సాయిపల్లవి పోర్షన్ షూటింగు మొత్తం పూర్తయిందట. రానా పోర్షన్ ను పూర్తి చేయవలసి ఉందని అంటున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.


More Telugu News