నూజివీడులో మరో 28 రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు.. ఆదేశాలు జారీ చేసిన తహసీల్దార్
- ఓ మహిళకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్
- వచ్చే నెల 8 వరకు లాక్‌డౌన్ పెంపు
- ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలకు అనుమతి
కృష్ణాజిల్లా నూజివీడులో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తహసీల్దార్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు. స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన ఓ మహిళకు నూజివీడు ఆసుపత్రిలో నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో కరోనా అని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో నిర్ధారించుకునేందుకు ఆమె నుంచి మరిన్ని శాంపిల్స్ సేకరించి విజయవాడ పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిన్నటి నుంచి 28 రోజులపాటు అంటే జూన్ 8 వరకు పట్టణంలో లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నట్టు సురేశ్‌కుమార్ తెలిపారు. రెడ్ జోన్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే కూరగాయలు, నిత్యావసర దుకాణాలు తెరవాలని ఆయన ఆదేశించారు. కాగా, కృష్ణలంక భ్రమరాంబపురంలోని సతీశ్ కుమార్ రోడ్డులో సోమవారం ఒక కరోనా కేసు వెలుగుచూసింది.