ప్లాన్ మార్చుకున్న ప్రభాస్ సినిమా

ప్లాన్ మార్చుకున్న ప్రభాస్ సినిమా
  • ముగింపు దశలో ప్రభాస్ సినిమా
  •  విదేశాల్లో షూటింగు లేనట్టే
  • రామోజీ ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరణ  
ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.  కథానేపథ్యం మేరకు ఈ సినిమా చాలావరకూ విదేశాల్లో షూటింగు జరుపుకోవలసి వుంది. విదేశాల్లో కొంతవరకూ షూటింగు జరిపారు. ఆ తరువాత హైదరాబాద్ లో ప్రతేకమైన సెట్స్ వేసి చిత్రీకరణ కానిస్తున్నారు. అయితే సెట్స్ వేయడం కుదరని విదేశీ లొకేషన్స్ కి మళ్లీ వెళ్లవలసి వుంది. కానీ కరోనా కారణంగా ఇప్పట్లో అక్కడికి వెళ్లలేని పరిస్థితులు వున్నాయి.

 దాంతో హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలోనే మిగతా చిత్రీకరణ జరపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకు తగినట్టుగానే స్క్రిప్ట్ లోను మార్పులు చేశారని వినికిడి. లాక్ డౌన్ ఎత్తేయగానే షూటింగు మొదలయ్యేలా ప్లాన్  చేసుకున్నారని అంటున్నారు. లాక్ డౌన్ కాలంలో ఈ సినిమా టీమ్ ఎంత మాత్రం సమయాన్ని వృథా చేయలేదట. ఇంతవరకూ షూట్ చేసిన సన్నివేశాలకి సంబంధించిన ఎడిటింగ్ .. డబ్బింగ్ పనులను కానిస్తూనే వచ్చారని అంటున్నారు. ఈ సినిమాకి ' ఓ డియర్' .. ' రాధే శ్యామ్' టైటిల్స్ ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News