రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం కుదరదని ప్రధానికి తెలిపిన సీఎం కేసీఆర్
- ప్రయాణికుల రైళ్లను నడపవద్దని కోరిన సీఎం కేసీఆర్
- ప్రధాన నగరాల్లో కరోనా ఎక్కువగా ఉందని వెల్లడి
- అన్ని రాష్ట్రాలు వలస కూలీలను అనుమతించాలని విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికుల రైళ్ల పునరుద్ధరణ తొందరపాటు చర్య అవుతుందని, దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో కరోనా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లపై తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పటి పరిస్థితుల్లో రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదని అన్నారు.
అంతేగాకుండా, వలస కూలీల అంశంపైనా సీఎం కేసీఆర్ ప్రధానితో మాట్లాడారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని, వలస కూలీలను అనుమతించకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగా ప్రభావితమైందని, అప్పులు చెల్లించే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రాల రుణపరిమితి పెంచాలని, రుణాల రీషెడ్యూల్ చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.