ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్

  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాతృభూమి ఫౌండేషన్
  • భౌతికదూరం విస్మరిస్తున్నారంటూ కోర్టుకు తెలిపిన పిటిషనర్
  • మద్యంతో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుందని వెల్లడి
కేంద్రం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రాలన్నీ మద్యం దుకాణాలు తెరిచిన సంగతి తెలిసిందే. ఏపీలోనూ మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే, మందుబాబులు భౌతికదూరం నిబంధనలను విస్మరిస్తూ ప్రమాదకరరీతిలో మద్యం దుకాణాలకు పోటెత్తుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఏపీలో మద్యం విక్రయాలపై మాతృభూమి ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లలో భౌతికదూరం అమలులో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ ఆరోపించారు. మద్యపానం కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


More Telugu News