నివేదిక వచ్చే వరకు ‘ఎల్జీ పాలిమర్స్’ మూసే ఉంటుంది: మంత్రి కన్నబాబు
- పరిశ్రమ నుంచి స్టిరీన్ తరలింపు చర్యలు చేపట్టాం
- రెండు కంటైనర్ షిప్స్ ద్వారా స్టిరీన్ తరలింపు
- మొత్తం స్టిరీన్ ను దక్షిణ కొరియా తరలిస్తున్నాం
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ మూతపడిందని ఏపీ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకూ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ మూసే ఉంటుందని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ లో ఒక టన్ను స్టిరీన్ కూడా ఉండేందుకు వీలు లేదని ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.
స్టిరీన్ ను తరలించేందుకు ప్రభుత్వం రెండు కంటైనర్ షిప్స్ ను ఏర్పాటు చేసిందని, ఒక కంటైనర్ షిప్ లో 8,500 టన్నులు లోడ్ చేయడం ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు. స్టిరీన్ తరలింపు ప్రక్రియకు ఇంకా ఐదు రోజులు పడుతుందన్న నిపుణుల సూచనను ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు చెప్పారు. మొత్తం స్టిరీన్ ను దక్షిణ కొరియాకు తరలిస్తున్నారని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారని వివరించారు.