సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున చరిత్ర సృష్టించిన భారత్!

  • 1998 మే 11న ఫోక్రాన్ అణుపరీక్షలను నిర్వహించిన భారత్
  • ఉలిక్కి పడ్డ ప్రపంచ అగ్ర దేశాలు
  • మే 11ను 'నేషనల్ టెక్నాలజీ డే'గా జరుపుకుంటున్న ఇండియా
1998 మే 11వ తేది... అంటే సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు. ఇండియా చరిత్ర సృష్టించింది. భారత్ చేసిన పనికి ప్రపంచ అగ్రదేశాలు ఉలిక్కి పడ్డాయి. ప్రధాని వాజ్ పేయి, ప్రధానికి శాస్త్ర, శాంకేతిక సలహాదారుడైన అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి) ఆధ్వర్యంలో రాజస్థాన్ లోని ఫోక్రాన్ ప్రాంతంలో రెండోసారి అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. అంతకుముందు 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలతో తొలిసారిగా అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఆ తర్వాత వాటి జోలికి వెళ్లలేదు. దీంతో మళ్లీ ఫోక్రాన్ లో వాజ్ పేయి ఆదేశాలతో నిర్వహించడం జరిగింది.  

ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అమెరికా కళ్లుగప్పి ఈ పరీక్షలను ఇండియా నిర్వహించింది. భూగర్భ అణపరీక్షలను నిర్వహించిన తర్వాత కానీ అమెరికా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయింది. ఆ తర్వాత భారత్ పై అమెరికా భగ్గుమంది. ఆంక్షలను విధించింది. అయినప్పటికీ ఆ తర్వాత భారత్ స్వయంకృషితో శాస్త్ర, సాంకేతాక రంగాల్లో గణనీయమైన అభివృద్దిని సాధించింది. ఫోక్రాన్ అణు పరీక్షలను నిర్వహించిన మే 11వ తేదీని భారత్ 'నేషనల్ టెక్నాలజీ డే'గా జరుపుకుంటోంది.


More Telugu News