లాక్‌డౌన్ సమయంలో ఛార్జీలు పెంచడం దుర్మార్గపు చర్య: ఏపీ సర్కారుపై కళా వెంకట్రావు మండిపాటు
- ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై అభ్యంతరం
- పెంచిన ఛార్జీలకు జగనన్న విద్యుత్ దీవెన పథకం అని పేరు పెట్టుకోండి
- అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ వేళ ప్రజలకు అండగా ఉన్నాయి
- ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచుతోంది
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఉపాధి దొరకక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచుతూ వెళ్లిపోతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెంచిన ఛార్జీలకు జగనన్న విద్యుత్ దీవెన పథకం అని పేరు పెట్టుకోండని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ వేళ ప్రజలకు అండగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచి ఇబ్బందులు పెడుతోందని ఆయన విమర్శించారు. వెంటనే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.