ఏపీలో 2,000 మార్కును దాటిన కరోనా కేసులు
- 24 గంటల్లో 38 మందికి కొవిడ్-19
- కరోనా కేసుల మొత్తం సంఖ్య 2018
- చిత్తూరులో కర్నూలులో కొత్తగా 9 కేసుల చొప్పున నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఈ సంఖ్య తాజాగా 2,000 మార్కును దాటింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018గా ఉందని తెలిపింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5 కేసులు నమోదయినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కృష్ణాలో 3, నెల్లూరులో 1 , కర్నూలులో 9, విశాఖపట్నంలో 3 కేసులు నమోదయ్యాయని వివరించింది.
జిల్లాల వారిగా కేసుల వివరాలు..
గ్రాఫ్ రూపంలో..