బ్రిటన్‌లో జూన్ 1 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. ఎవరికివారు జాగ్రత్తగా ఉండాలన్న బోరిస్
- ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని బోరిస్ జాన్సన్
- జూన్ 1 నుంచి స్కూళ్లు, కొన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి
- జులై 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షల తొలగింపు
దేశంలో లాక్‌డౌన్‌ను వచ్చే నెల ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇటీవల కొంత నెమ్మదించిన కరోనా కేసులు మళ్లీ పుంజుకున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
లాక్‌డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదని పేర్కొన్న ఆయన జూన్ ఒకటో తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు తెలిపారు. జూన్ 1 నుంచి కొన్ని ప్రాథమిక పాఠశాలలు, కొన్ని ఇతర దుకాణాలు తెరుచుకుంటాయన్నారు. అలాగే, జులై 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలను సడలించనున్నట్టు చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం తప్పనిసరి అని ప్రధాని స్పష్టం చేశారు.
ఎవరికివారు జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోవాలని బోరిస్ పిలుపునిచ్చారు. వైరస్ ప్రభావం ఎక్కువకాలం ఉండే అవకాశం ఉందని, మహమ్మారిని అణచివేసేందుకు సరైన ఔషధం వచ్చే వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడం తప్ప మరో మార్గం లేదన్నారు. వర్క్ ఫ్రం హోం చేయలేని వారు కార్యాలయాలకు వెళ్లి పనిచేసుకోవచ్చని, అయితే, భౌతిక దూరం తప్పనిసరని అన్నారు. కాగా ఇప్పటి వరకు బ్రిటన్‌లో 2,19,183 మంది కరోనా బారినపడగా, 32 వేల మందికిపైగా మరణించారు.