ఇది నాకు నా దైవ సమానులైన పవన్ కల్యాణ్ ఇచ్చిన భిక్ష: బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- గబ్బర్ సింగ్ సినిమా విడుదలై ఎనిమిదేళ్లవుతుంది
- గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను
- 80 ఏళ్ల తర్వాత కూడా మన గబ్బర్ సింగ్ గురించి చర్చిస్తారు
- పవన్ కల్యాణ్ ఒక వ్యసనం.. చచ్చిపోయే దాక మర్చిపోలేం
గబ్బర్ సింగ్ సినిమా విడుదలై ఎనిమిదేళ్లవుతున్న సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పొగుడుతూ నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'గబ్బర్ సింగ్.. ఇది నాకు నా దైవ సమానులైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన భిక్ష.. ఎప్పటికీ నేను కృతజ్ఞుడిని' అని ఆయన వరుసగా ట్వీట్ చేశారు.
'అందరూ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు. నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను' అని తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.
'ఎనిమిదేళ్లు కాదు 80 ఏళ్ల తర్వాత కూడా మన గబ్బర్ సింగ్ గురించి చర్చిస్తారు.. పవర్ స్టార్ ఎప్పటికీ ఓ చరిత్ర. పవన్ కల్యాణ్ ఒక వ్యసనం.. అలవాటు అయ్యారంటే చచ్చిపోయే దాక మర్చిపోలేం' అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.
'చరిత్రలో కొన్ని చిరస్థాయిగా ఉండిపోతాయి.. తెలుగు చలనచిత్ర చరిత్రలో గబ్బర్ సింగ్ ఎప్పటికీ చరిత్ర. తింటే గారెలు తినాలి వింటే రామాయణం వినాలి తీస్తే గబ్బర్ సింగ్ తీయాలి ఇది నా అదృష్టం జై పవర్ స్టార్' అని ఆయన పేర్కొన్నారు.
'ఈ రోజుల్లో నిన్నటి రోజున పొందిన సహాయాన్ని మర్చిపోయి మళ్లీ ఎదురు తిరిగి వారిని ప్రశ్నిస్తారు. కానీ, నేను మాత్రం ఈ జన్మంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను' అని బండ్ల గణేశ్ చెప్పారు.