ఉద్ధవ్ థాకరేకు లైన్ క్లియర్.. నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
- ఈ నెల 21న మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు
- కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో శివసేనలో టెన్షన్
- నిన్న ఒకరు ఉపసంహరించుకోవడంతో ఉద్ధవ్‌కు లైన్ క్లియర్
మహారాష్ట్రలో ఈ నెల 21న 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉద్ధవ్ థాకరే సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితిలో మిత్ర పక్షం కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు రాజేశ్ రాథోడ్, రాజ్‌కిశోర్ మోదీ నామినేషన్లు దాఖలు చేయడంతో శివసేనలో కొంత టెన్షన్ నెలకొంది. 9 స్థానాలకు 10 మంది అభ్యర్థులు వచ్చి చేరడంతో ఎన్నికలు తప్పనిసరయ్యాయి. దీంతో శివసేనలో గుబులు ప్రారంభమైంది.
ముందస్తు నిర్ణయం ప్రకారం మహా వికాస్ అఘాఢీలో భాగమైన కాంగ్రెస్ తొలుత ఒక్కరినే బరిలోకి దింపాలని భావించినా అనూహ్యంగా ఇద్దరు నామినేషన్ వేయడంతో కాంగ్రెస్-శివసేన మధ్య చెడిందని భావించారు. అయితే, నిన్న ఆ పార్టీ అభ్యర్థి రాజ్ కిశోర్ మోదీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఉద్ధవ్ థాకరే ఎన్నిక ఏకగ్రీవం కానుంది.