ఆపిల్ రైతు బాలాజీనీ హైదరాబాద్ తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశం
- తెలంగాణలోనూ ఆపిల్ సాగు
- మంచి దిగుబడి సాధించిన రైతు బాలాజీ
- రైతు బాలాజీకి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు
ఇప్పటివరకు సిమ్లా, కశ్మీర్ వంటి చల్లని ప్రాంతాల్లోనే కాసే ఆపిల్ పండ్లు ఇప్పుడు తెలంగాణలో కూడా సాగు చేస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన బాలాజీ అనే రైతు ఆపిల్ పంట సాగు చేసి, మంచి దిగుబడి సాధించాడు. ఈ మేరకు రైతు బాలాజీకి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. బాలాజీని హైదరాబాద్ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతు బాలాజీ తన ఆపిల్ పంట తొలి ఫలాలను సీఎంకు కానుకగా అందించనున్నారు.