698 మందితో మాల్దీవుల నుంచి కొచ్చి చేరుకున్న భారీ నౌక
- విదేశాల్లోని భారతీయులను తీసుకువస్తున్న కేంద్రం
- శుక్రవారం రాత్రి మాల్దీవుల నుంచి బయల్దేరిన ఐఎన్ఎస్ జలాశ్వ
- తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా రాక
వందే భారత్ మిషన్ పేరిట విదేశాల్లో ఉన్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దేశాల నుంచి విమానాల్లో భారతీయులు సొంతగడ్డపై అడుగుపెడుతున్నారు. తాజాగా, మాల్దీవుల నుంచి 698 మంది భారతీయులతో నేవీకి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ అనే నౌక కొచ్చి పోర్టుకు చేరుకుంది. ఈ నౌక మాల్దీవుల నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరింది.
మాల్దీవుల నుంచి వచ్చినవారిలో అత్యధికులు కేరళీయులే. కేరళకు చెందినవారు 440 మంది కాగా, తమిళనాడుకు చెందినవారు 110, కర్ణాటకకు చెందినవారు 45 మంది ఉన్నారు. ఇక, ఏపీకి చెందిన 8 మంది, తెలంగాణకు చెందిన 9 మంది కూడా మాల్దీవుల నుంచి కొచ్చి వచ్చిన వారిలో ఉన్నారు. కాగా, ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేసినట్టు ప్రయాణికులు తెలిపారు.
కాగా, మాల్దీవుల్లో మిగిలున్న 202 మంది భారతీయులతో మరో నౌక ఐఎన్ఎస్ మగర్ కూడా బయల్దేరినట్టు తెలుస్తోంది.