ధాన్యం కొనుగోలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది: నిమ్మల రామానాయుడు
- ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆరోపణ
- రైతులు మద్దతుధర కోల్పోతున్నారంటూ వ్యాఖ్యలు
- ఈ-కర్షక్ నిబంధనలతో రైతులను తిప్పుతున్నారంటూ ఆగ్రహం
పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతులు మద్దతుధర కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.
అన్నం పెట్టే రైతు నోటికి సున్నం పెడుతోందని, ఈ-కర్షక్ నిబంధనలతో రైతులను తిప్పుతున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 16 లక్షల టన్నుల ధాన్యానికి 10 లక్షల టన్నులకే అనుమతి ఇచ్చారని, మిగిలిన 6 లక్షల టన్నుల ధాన్యం ఎవరికి అమ్ముకోవాలని నిలదీశారు.