ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి పరిస్థితి విషమం!
- నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన అజిత్ జోగి
- రాయిపూర్ లోని ఆస్పత్రిలో ఆయనకు చికిత్స
- కోమాలోకి అజిత్ జోగి..హెల్త్ బులిటిన్ విడుదల
ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాయిపూర్ లోని శ్రీ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజిత్ జోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు. అజిత్ జోగి మెదడుకు ఆక్సిజన్ అందని కారణంగా ఆయన కోమాలోకి వెళ్లిపోయినట్టు వైద్యులు తెలిపారు.
కాగా, నిన్న ఉదయం భోజనం చేసే సమయంలో అజిత్ జోగి అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తీసుకుంటున్న సమయంలో చింతపండులోని గింజ ఆయన శ్వాసనాళంలోకి చేరడంతో ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఆపరేషన్ ద్వారా చింతపండు గింజను వైద్యులు తొలగించారు. జోగి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న సమయంలోనే ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు.