దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం

  • రిక్టర్ స్కేల్ పై 3.4 తీవ్రత
  • ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లో భూకంప కేంద్రం
  • లాక్ డౌన్ ప్రకటించాక ఢిల్లీ ప్రాంతంలో మూడోసారి భూకంపం
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు ఈ మధ్య తరచుగా భూకంపాలకు గురవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.4గా నమోదైంది. నష్టం వివరాలు తెలియరాలేదు. కాగా, భూకంప కేంద్రం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ మధ్యాహ్నం భూమిలోపల ఐదు కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించిందని వాతావరణ విభాగం తెలిపింది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఢిల్లీ ప్రాంతంలో భూకంపం సంభవించడం ఇది మూడోసారి. గతంలో సంభవించిన రెండు భూకంపాల కేంద్రం ఒకే ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది.


More Telugu News