విశాఖ ఘటనకు కారకులపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయి: ఏపీ మంత్రి సుచరిత

  • గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది
  • దీనిపై విచారణ జరుగుతోంది
  • ఈ పరిశ్రమను అక్కడి నుంచి తరలించే యోచన 
విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని. దీనిపై విచారణ జరుగుతోందని ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే,  ఈ ఘటనకు కారణమైన పరిశ్రమను అక్కడి నుంచి తరలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా వలస కార్మికుల తరలింపు అంశం గురించి ఆమె ప్రస్తావించారు. వలస కార్మికులను అందరినీ వారి స్వస్థలాలకు ఒకేసారి తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకని, మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడం, మద్యం ధరలు పెంచడం చేశామని చెప్పారు. రాష్ట్రంలో ‘కరోనా’ నివారణలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.


More Telugu News