నిజంగా తల్లి ప్రేమను మించింది ఇంకేదీ ఉండదు: సీఎం జగన్

  • మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం
  • జీవితకాలంలో అనేక బాధ్యతలు నిర్వర్తిస్తారంటూ కితాబు
  • తల్లి అంటే తరగని స్ఫూర్తి అని ట్వీట్
ఏపీ సీఎం వైఎస్ జగన్ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా శుభకాంక్షలు తెలియజేశారు. "తమ జీవితకాలంలో అనేక బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి మాతృత్వానికి ప్రతీకలుగా నిలిచిన తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఓ అంతరంగికురాలిగా, ఓ సలహాదారుగా, ఓ సంరక్షకురాలిగా, అన్నిటికంటే ముఖ్యంగా తరగని స్ఫూర్తిగా నిలిచేది మాతృమూర్తి మాత్రమే. నిజంగా, తల్లి ప్రేమను మించిన ప్రేమ మరేమీ ఉండదు" అంటూ  ట్వీట్ చేశారు.


More Telugu News