రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన దిల్ రాజుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన బండ్ల గణేశ్
- ఈ రోజు రాత్రి దిల్ రాజు వివాహం
- దిల్ రాజు చేసిన ప్రకటనను పోస్ట్ చేసిన బండ్ల గణేశ్
- దేవుడు ఎల్లప్పుడూ దిల్ రాజును దీవిస్తూనే ఉంటాడని వ్యాఖ్య
ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తాను కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన అధికారికంగా ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజామాబాద్‌లో దిల్ రాజు కుటుంబం అప్పట్లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు రాత్రి ఈ వివాహం జరగనున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు చేసిన ప్రకటనను పోస్ట్ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్... 'ఆల్ ది బెస్ట్ అన్న.. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను దీవిస్తూనే ఉంటాడు' అని పేర్కొన్నారు.
కాగా, కొన్ని గంటల క్రితం దిల్ రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. చాలా మంది కూడా వృత్తిపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వ్యక్తిగతంగా తన జీవితం ఇప్పుడు అంతా గొప్పగా లేదని చెప్పారు. కానీ త్వరలోనే ఈ పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నానని, ఈ ఆశతోనే తాను కొత్త జీవితం ప్రారంభించడానికి తనకు సమయం వచ్చిందని భావిస్తున్నానని చెప్పారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తన పోస్ట్ లో పేర్కొన్నారు.