సరిహద్దుల వద్ద పాకిస్థాన్ చర్యలపై రంగంలోకి దిగిన అజిత్ దోవల్
- సరిహద్దు వెంబడి పాకిస్థాన్ వాయుసేన కార్యకలాపాలు
- కశ్మీర్ లోయలో ప్రస్తుత పరిస్థితిపై దోవల్ సమావేశం
- కీలక సూచనలు చేసిన దోవల్
ఇటీవల కొంతమంది హిజ్బుల్ ఉగ్రవాదులను కశ్మీర్‌లో భారత భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ఉగ్రవాది రియాజ్ నైకూ, అతడి సహచరుడు కూడా హతమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. అంతేగాక, సరిహద్దు వెంబడి పాకిస్థాన్ వాయుసేన కార్యకలాపాలు పెరిగిపోయాయి.
దీంతో ఈ విషయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. కశ్మీర్ లోయలో ప్రస్తుత పరిస్థితిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియంత్రణ రేఖ వెంట ఉన్న కౌంటర్ చొరబాటు గ్రిడ్‌ను మరింత కఠినతరం చేయాలన్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా, బారాముల్లా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి. భద్రతా బలగాల సోదాల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల చొరబాట్లు అధికమైన నేపథ్యంలో అజిత్ దోవల్ ఈ సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు.