హైదరాబాద్‌లో మాస్కులు ధరించని 41 మందికి జరిమానా
- మాస్కు తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం
- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా
- వెయ్యి రూపాయల చొప్పున జరిమానా
కరోనా వైరస్ ప్రబలకుండా ఆంక్షలను కఠినతరం చేసిన తెలంగాణ ప్రభుత్వం మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించకుంటే జరిమానా తప్పదని హెచ్చరించింది. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు.
శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ రవికిరణ్ ఆదేశాల మేరకు నిన్న జోన్ పరిధిలోని సర్కిళ్లలో మాస్కులు ధరించని 41 మందికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో 30 మందికి, చందానగర్ పరిధిలో ఏడుగురికి, యూసఫ్‌గూడలో నలుగురికి జరిమానాలు విధించినట్టు పోలీసులు తెలిపారు.