హైదరాబాద్ లో పకడ్బందీగా లాక్ డౌన్... అనవసరంగా బయటకు వస్తే తాట తీస్తున్న పోలీసులు!
- హైదరాబాద్ పరిధిలో తగ్గని కేసులు
- బయటకు వస్తే వాహనం స్వాధీనం, జరిమానా, కేసులు
- అనుమతించిన వారిని వదిలేస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గకపోవడంతో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు కదిలారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి తాట తీస్తున్నారు. వారిపై జరిమానాలు విధిస్తూ, కేసులను పెట్టి, వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు నిర్మాణ రంగానికి అనుమతులు ఇవ్వడం, మద్యం దుకాణాలు, ఉక్కు, సిమెంట్, ఎలక్ట్రికల్ దుకాణాలు తెరచుకోవడంతో ప్రజలు బయటకు రావడం పెరిగింది. జనసంచారం ఒక్కసారిగా పెరగడంతో వైరస్ వ్యాప్తికి అవకాశాలు చిక్కినట్లయింది. ఐటీ కంపెనీలు సైతం 33 శాతం ఉద్యోగులతో పనులు ప్రారంభించాయి.
కేవలం సడలింపులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు వదిలేస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో పికెటింగ్ ను ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.