హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
- న్యూమోనియా, అధిక జ్వరంతో బాధపడుతున్న బల్బీర్
- కరోనా టెస్టు నిర్వహించిన వైద్యులు
- ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన భారత జట్టులో సభ్యుడు
భారత హాకీ లెజెండ్, ట్రిపుల్ ఒలింపియన్ బల్బీర్ సింగ్ (96) తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కుమార్తె, మనవడితో కలిసి బల్బీర్ చండీగఢ్‌లో నివసిస్తున్నారు. న్యూమోనియాతోపాటు, అధిక జ్వరంతో బాధపడుతున్న ఆయనను వెంటనే నగరంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు.
న్యూమోనియాతో బాధపడుతున్న బల్బీర్ గతంలో 108 రోజులు పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నారు. కాగా, ఆసుపత్రిలో చేరిన బల్బీర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. భారత హాకీ జట్టు అనేక విజయాల్లో బల్బీర్ సింగ్ పాలుపంచుకున్నారు. 1948, 1952, 1956లలో ఒలింపిక్స్‌లలో స్వర్ణం గెలుపొందిన భారత జట్టులో బల్బీర్ సభ్యుడు.