హాంకాంగ్ లో కరోనా రోగులపై ఫేజ్-2 ట్రయల్స్ ఆశాజనకం!

  • మూడు ఔషధాలను కలిపి ప్రయోగించిన రీసెర్చర్లు  
  • మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడి
  • వివరాలు ప్రచురించిన 'లాన్ సెట్' పత్రిక
కరోనా వైరస్ సోకి, ప్రారంభదశలో బాధించబడుతున్న వారిపై హాంకాంగ్ ప్రొఫెసర్లు జరిపిన పరీక్షల్లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. రోగులకు మూడు రకాల మందులను వేయగా, స్వల్ప లక్షణాలున్న వారు వారం రోజుల్లో ఇతర కరోనా పేషెంట్లు 12 రోజుల్లో కోలుకున్నారని, వారిలో కరోనా లక్షణాలు తగ్గాయని యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్ ప్రకటించింది. 'లాన్ సెట్' పత్రికలో ఈ ప్రయోగ ఫలితాలు ప్రచురించబడ్డాయి.

ప్రొఫెసర్‌ క్వాక్‌–యంగ్‌ యుయేన్‌ నేతృత్వంలోని బృందం, నగరంలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 20 మధ్య, 127 మందిపై ఈ ప్రయోగాలు చేశారు. వీరిలో 86 మందికి లోపినావిర్- రిటోనావిర్, రిబా–విరిన్, బేటా–1బి ఇంజెక్షన్ ‌లను ఇవ్వగా, మిగిలిన 41 మందికి కేవలం లోపినావిర్‌- రిటోనావిర్‌ మాత్రమే ఇచ్చారు. ఆపై మూడు రకాల మందులు తీసుకున్న వారు త్వరగా మెరుగుపడ్డారని క్వాక్-యంగ్ వెల్లడించారు. కరోనాపై పోరులో తమ ప్రయోగాలు విజయవంతం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News