సరిహద్దుల్లో మరోసారి పాక్ కాల్పులు... దీటుగా స్పందించిన భద్రతా బలగాలు!

  • పూంచ్ జిల్లాలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
  • నియంత్రణ రేఖ పొడవునా మోర్టార్లతో కాల్పులు
  • నిన్న కూడా పాక్ కవ్వింపులు
జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఎప్పట్నించో జరుగుతోంది. తాజాగా మరోసారి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. పూంచ్ జిల్లాలోని దేగ్వార్ సెక్టార్ లో నియంత్రణ రేఖ పొడవునా మోర్టార్లతో గుళ్ల వర్షం కురిపించారు.

ఎలాంటి కవ్వింపులు లేకుండానే పాక్ రేంజర్లు తుపాకులకు, మోర్టార్లకు పనిచెప్పినట్టు అర్థమవుతోంది. అయితే, పాక్ ఉల్లంఘనకు భారత్ దీటైన జవాబిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, పూంచ్ జిల్లాలో నిన్న కూడా కాల్పులు జరగ్గా, పాక్ వైపు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. కనీసం ముగ్గురు పాక్ సైనికులు మరణించి ఉంటారని భారత భద్రతా బలగాలు భావిస్తున్నాయి.


More Telugu News