తమ్మారెడ్డి భరద్వాజతో వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నాం: ప్రేమరాజ్

  • జరిగిన దానికి తమ్మారెడ్డి విచారణ వ్యక్తం చేశారు
  • అన్నదమ్ముల్లా కలిసి పని చేసుకుందాం
  • తెలంగాణ కార్మికులను ఆదుకున్నందుకు చిరంజీవికి ధన్యవాదాలు
తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా తెలంగాణ యూనియన్లను ఎందుకు పెట్టారంటూ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. అయితే, తన వ్యాఖ్యలను తమ్మారెడ్డి వెనక్కి తీసుకున్నారని, జరిగిన దానికి విచారం వ్యక్తం చేశారని... దీంతో, ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నామని తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రేమరాజ్ తెలిపారు. అందరం అన్నదమ్ముల్లా కలిసిమెలసి, ఎప్పటిలాగానే పని చేసుకుందామని చెప్పారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా తెలంగాణ యూనియన్లలోని కార్మికులను ఆదుకున్నందుకు చిరంజీవికి, కమిటీ పెద్దలకు ధన్యవాదాలు చెబుతున్నామని ప్రేమకుమార్ అన్నారు. సీసీసీ ద్వారా తెలంగాణ కార్మికులను ఆదుకునే విషయంలో కృషి చేసిన ఎన్.శంకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో ఇప్పట్లో షూటింగులు ప్రారంభమయ్యే అవకాశం లేదని... అందువల్ల రెండో విడత సాయంలో కూడా తెలంగాణ యూనియన్లకు సాయం చేయాలని విన్నవించారు.


More Telugu News