ఏపీ, తెలంగాణ మధ్య స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి పరిమిత సంఖ్యలో అనుమతి... సర్కారు యోచన!

  • లాక్ డౌన్ సడలింపుల్లో మరిన్ని వెసులుబాట్లకు ప్రభుత్వం నిర్ణయం
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు!
  • తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అనుమతించే విషయంపై ప్రణాళిక
లాక్ డౌన్ నిబంధనల సడలింపుల్లో మరికొన్ని వెసులుబాట్లు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు నెలకొనేలా చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ వెసులుబాటు సమయాన్ని పెంచాలని ఈ మేరకు నిర్ణయించింది.

ఈ క్రమంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేలా సడలింపునకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే, సరి-బేసి సంఖ్యలో దుకాణాలను విభజించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దుకాణాల పర్యవేక్షణ బాధ్యత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అప్పగించాలని భావిస్తున్నారు.

ఇక కేంద్రం సూచనల మేరకు సొంత వాహనాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్వస్థలాలకు వెళ్లేవారికి పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చే దిశగా కార్యాచరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అనుమతించే అంశంపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.


More Telugu News