మాస్క్ లేకపోతే బాదుడే.. ఏఐ సిస్టంను రంగంలోకి దించుతున్న హైదరాబాద్ పోలీసులు
- మాస్కులు లేకుండా రోడ్డుపైకి వస్తే వెయ్యి ఫైన్
- రెండు, మూడు రోజుల్లో ఏఐ సిస్టమ్ ను అమలు చేయనున్న నగర పోలీసులు
- ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు
కరోనా కట్టడిలో భాగంగా మాస్కులు లేకుండా బయటకు వచ్చేవారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో దీన్ని కఠినంగా అమలు చేయడానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించేందుకు నగర పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు సిద్ధమవుతున్నారు.
మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ను పోలీసులు వాడబోతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ టెక్నాలజీని అమలు చేయబోతున్నారు. ఆ తర్వాత దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తికి ఏ విధంగా చలాన్లు పంపించాలనే విషయాన్ని వర్కౌట్ చేస్తున్నామని చెప్పారు. మొబైల్ ద్వారా చలాన్ పంపించాలా? లేక మరేదైనా ఇతర మార్గం ద్వారా పంపించాలా? అనే విషయంపై కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.