అమిత్ షా ఆదేశాలతో గుజరాత్ కు పరుగులు పెట్టిన ఎయిమ్స్ చీఫ్!

  • గుజరాత్ లో కరోనా విజృంభణ 
  • తక్షణమే వెళ్లాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ కు అమిత్ షా ఆదేశం
  • ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో వెళ్లిన డాక్టర్ గులేరియా
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మొత్తం 7,402 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. ఇప్పటి వరకు దాదాపు 449 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు. గుజరాత్ లో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తున్న తరుణంలో అమిత్ షా ప్రత్యేక దృష్టిని సారించారు. వెంటనే గుజరాత్ కు వెళ్లాలంటూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాను ఆదేశించారు.

అమిత్ షా ఆదేశాలతో డాక్టర్ గులేరియాతో పాటు మరో డాక్టర్ మనీశ్ సురేజా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో హుటాహుటిన గుజరాత్ చేరుకున్నారు. అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో డాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. కరోనా చికిత్సకు సంబంధించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కూడా ఆయన కలిసే అవకాశం ఉంది.


More Telugu News