వలస కార్మికుల రైళ్లను అనుమతించకపోవడం అన్యాయం: మమతపై అమిత్ షా అసంతృప్తి

  • మమతా బెనర్జీకి అమిత్ షా లేఖ
  • శ్రామిక్ రైళ్లతో కార్మికులను తరలిస్తున్నామని వెల్లడి
  • కేంద్రానికి బెంగాల్ నుంచి సహకారం అందడంలేదని వ్యాఖ్యలు
వలస కార్మికుల తరలింపు వ్యవహారంలో కేంద్రానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడంలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి వలస కార్మికుల రైళ్లను అనుమతించకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసి రెండు లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కానీ బెంగాల్ ప్రభుత్వ సహాయ నిరాకరణ వలస కార్మికుల పాలిట విఘాతంగా మారుతోందని విమర్శించారు. ఇకనైనా కార్మికుల సంక్షేమం నేపథ్యంలో కేంద్రం చర్యలకు సహకరించాలని సూచించారు.


More Telugu News