ఒక్క అరెస్ట్ చేయలేదు, ఒక్క ఆస్తిని జప్తు చేయలేదు... వైఎస్ జగన్ ఎక్కడున్నాడు?: చంద్రబాబు

ఒక్క అరెస్ట్ చేయలేదు, ఒక్క ఆస్తిని జప్తు చేయలేదు... వైఎస్ జగన్ ఎక్కడున్నాడు?: చంద్రబాబు
  • వైజాగ్ లో గ్యాస్ లీక్ ఘటన
  • ప్రజలు భయంతో వణికిపోతున్నారన్న చంద్రబాబు
  • రోడ్లపైనే పడుకుంటున్నారని వ్యాఖ్యలు
  • ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని నిలదీస్తూ ట్వీట్
వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. జరిగిన దుర్ఘటనతో భయకంపితులైన విశాఖ ప్రజలు రోడ్లపైనే పడుకుంటున్నారని తెలిపారు.

తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు వీధుల్లోకి వచ్చి, నిరసనలు తెలుపుతున్నారని, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు తమవారి మృతదేహాల పక్కన దీనంగా రోదిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘటనకు బాధ్యులైన ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని, కనీసం ఒక్క ఆస్తిని కూడా జప్తు చేయలేదని, ఇంతకీ వైఎస్ జగన్ ఎక్కడున్నాడు? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News