గ్యాస్ లీక్‌పై ఎల్‌జీ పాలిమర్స్ ప్రకటన.. బాధితులకు క్షమాపణలు!
- బాధితులకు సానుభూతి
- వారి కుటుంబాలకు అండగా నిలబడతాం
- మా బృందాలు పనిచేస్తున్నాయి
- ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. స్థానికులకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంది. బాధితులకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పింది. ఈ ఘటనలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలబడుతామని ప్రకటించింది. విష వాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది. అన్ని రకాల చర్యలను తక్షణమే అమలు చేస్తున్నామని పేర్కొంది. మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీర్ఘకాలికంగా బాధితులను ఆదుకునేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఎల్జీ పాలిమర్స్ చేసిన పూర్తి ప్రకటన..
ఎల్జీ పాలిమర్స్ చేసిన పూర్తి ప్రకటన..