ఆ కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం మంచిది కాదు: గ్యాస్ లీక్ ఘటనపై లోకేశ్
- ఎలాంటి మెడికల్ క్యాంపులు లేవు, షెల్టర్లు లేవు
- అంతా కలుషితం అయిపోయింది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి
- తమ సమస్యలు పరిష్కరించాలని యువత ఆందోళన తెలుపుతున్నారు
- వారి ఆవేదన అర్థం చేసుకోలేక పోవటం దారుణం
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆందోళనకు దిగిన వారిపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. 'ఎలాంటి మెడికల్ క్యాంపులు లేవు, షెల్టర్లు లేవు, అంతా కలుషితం అయిపోయింది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మా సమస్యలు పరిష్కరించండి అని స్థానిక యువత ఆందోళన తెలుపుతుంటే వారిని అడ్డుకొని కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం మంచిది కాదు' అని లోకేశ్ ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
'ఇన్ని సమస్యలు ఉంటే సీఎం జగన్ గారు రూ.పది కోట్లు ఇస్తాం, రూ.30 కోట్లు ఇస్తామని చెప్పి డబ్బుతో చూస్తున్నారని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదన అర్థం చేసుకోలేక పోవటం దారుణం' అని లోకేశ్ అన్నారు.