ఆ 5 గ్రామాల ప్రజలు 48 గంటల పాటు పునరావాస కేంద్రాల్లో ఉండాలి: మంత్రి అవంతి విజ్ఞప్తి

  • స్టిరీన్ వాయువును చాలా జాగ్రత్తలు తీసుకుని నియంత్రించాలి
  • రెండు రోజుల పాటు ప్రభుత్వానికి సహకరించాలి
  • వదంతులను ప్రజలు నమ్మొద్దు
  • ఆందోళనలకు గురి కావద్దు
విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయిన ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత బాగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆసుపత్రుల్లో సుమారు 500 మంది ఉన్నారని, వారికి చికిత్స అందుతోందని చెప్పారు. పరిస్థితిని ఏడుగురు మంత్రులు సమీక్షిస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు.

స్టిరీన్ వాయువును చాలా జాగ్రత్తలు తీసుకుని నియంత్రించాల్సి ఉంటుందని అవంతి చెప్పారు. ఆ పరిశ్రమ ఉన్న ప్రాంతంలోని వారంతా రెండు రోజుల పాటు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. గ్యాస్‌ లీకేజీ ఘటన నేపథ్యంలో వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. ప్రజలు ఎవరూ ఆందోళనలకు గురి కావద్దని చెప్పారు. ఐదు గ్రామాల ప్రజలు 48 గంటల పాటు పునరావాస కేంద్రాల్లో ఉండాలని ఆయన సూచించారు.


More Telugu News