నా ఫేవరేట్ హీరోయిన్ ఆమెనే: హీరో శ్రీవిష్ణు

  • వెంకటేశ్ గారికి వీరాభిమానిని
  •  పార్వతీ మీనన్ నటన అంటే ఇష్టం
  • ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందన్న శ్రీ విష్ణు  
తెలుగులో విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో శ్రీవిష్ణు ఒకరుగా కనిపిస్తాడు.  'బ్రోచేవారెవరురా' తరువాత ఆ స్థాయి హిట్ ను అందుకోవడానికి ఆయన నానా తంటాలు పడుతున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "కథానాయికలు గ్లామర్ పరంగా .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు. పాత్రపై తమదైన ముద్రవేస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు. నేను పార్వతీ మీనన్ నటనను ఎక్కువగా ఇష్టపడతాను. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా ఆమె చాలా సింపుల్ గా చేసేస్తారు. అందువల్లనే ఆమె చాలా తక్కువ కాలంలోనే మలయాళంలో బిజీ కాగలిగారు. ఆమెతో కలిసి నటించాలని వుంది.

ఇక కథానాయకుల విషయానికొస్తే, తెలుగులో హీరోలంతా ఇష్టమే .. వెంకటేశ్ అంటే మరికొంచెం ఎక్కువ ఇష్టం.  చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలు వదలకుండా చూసేవాడిని. 'బొబ్బిలిరాజా'  తరువాత వెంకటేశ్ గారికి వీరాభిమానినయ్యాను.  ఆ అభిమానం ఇప్పటికీ అలా కొనసాగుతూనే వుంది" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News