సముద్ర ఒడ్డుకు వచ్చిన రెండు కోట్ల తాబేళ్లు.. అద్భుత వీడియో ఇదిగో

  • ఒడిశాలోని గహిర్మాతా బీచ్‌లో దృశ్యాలు
  • ప్రతి ఏడాది బయటకు వచ్చే తాబేళ్లు
  • వీడియో పోస్ట్ చేసిన ఫారెస్ట్ అధికారి
ఒడిశాలోని గహిర్మాతా బీచ్‌లో దాదాపు రెండు కోట్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కనపడ్డాయి. అవి గుడ్లు పెట్టడానికి ప్రతి ఏడాది సముద్రం నుంచి ఇలా ఒడ్డుకు వస్తాయి. అలాగే, పొదిగిన తర్వాత వాటి పిల్లలు ఉండడానికి ఇసుక గూళ్లు తయారు చేసుకుంటాయి. అరిబాడాగా పిలిచే ఈ ప్రక్రియ కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తాబేళ్ల పిల్లలు ఎదిగాక ఒకేసారి అన్నీ కలిసి మళ్లీ సముద్రం అడుగుకు వెళ్లిపోతాయి. తాజాగా లక్షలాది తాబేళ్లు సముద్ర తీరానికి రావడంతో వాటి వీడియో వైరల్ అవుతోంది.

ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుషాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఈ అద్భుత దృశ్యాన్ని చూశానని చెప్పారు. ఇక్కడ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చే దృశ్యం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. దాదాపు 2 కోట్ల ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు 4 లక్షల ఇసుక గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయని ఆయన చెప్పారు. తమ పిల్లలను తీసుకొని ఒకేసారి సముద్రంలోకి వెళతాయని వివరించారు.



More Telugu News