ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు!: గ్యాస్ లీక్‌పై దేవినేని ఉమ
- సునామీ, హుద్ హుద్ , తిత్లీలను విశాఖ ఎదుర్కొంది
- ఎల్జీ కంపెనీ వల్ల వేలాది మంది భయం గుప్పెట్లో ఉన్నారు
- ప్రభుత్వ సాయం అందించాలని మీకు తెలియదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు విమర్శలు గుప్పించారు. 'సునామీ, హుద్ హుద్ , తిత్లీలు తట్టుకొన్న విశాఖలో నేడు ఎల్జీ కంపెనీ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ప్రజలు గ్రామాలు వదిలి భయం గుప్పెట్లో రోడ్లపై గడుపుతున్నారు. రాజప్రాసాదాల్లో ఉన్న నాయకులారా మీకు కనిపించడం లేదా పునరావాసం, ప్రభుత్వ సాయం అందించాలని? ఈ విషయాన్ని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.
కాగా, గ్యాస్ లీక్ దుర్ఘటనతో విశాఖ శివార్లలోని గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయని వార్తా పత్రికల్లో రాశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంపెనీకి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలంతా తరలివెళ్లాలని ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించిందని, దీంతో ప్రజలంతా భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లారని పేర్కొన్నారు. దాదాపు 20 ప్రాంతాలకు చెందిన ఏడు లక్షల మంది తరలిపోయారని తెలిపారు.