ఆ డబ్బులు నేను చెల్లిస్తా.. ఆమె మృతదేహాన్ని తమిళనాడుకు పంపండి: కేరళ సీఎంను కోరిన సినీ నటుడు రాఘవ లారెన్స్
- ఎన్ఐఎంఎస్ వైద్యశాలలో మృతి చెందిన పాత్రికేయుడి తల్లి
- చెల్లించాల్సిన లక్షన్నరను తాను చెల్లిస్తానని హామీ
- కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రశంస
తిరువనంతపురంలోని ఎన్ఐఎంఎస్ వైద్యశాలలో మృతి చెందిన తమిళనాడుకు చెందిన పాత్రికేయుడు అశోక్ తల్లిని ఆమె స్వస్థలానికి చేర్చేందుకు సహకరించాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు.
వైద్యశాలకు చెల్లించాల్సిన లక్షన్నర రూపాయలను చెల్లించే స్థితిలో ఆ పేద పాత్రికేయుడు లేడని, కాబట్టి సహకరించి కన్యాకుమారిలోని అతడి స్వస్థలానికి ఆమె భౌతిక కాయాన్ని పంపే ఏర్పాటు చేయాలని, ఆ సొమ్మును ఒకటి రెండు రోజుల్లో తానే చెల్లిస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన లారెన్స్.. తన తల్లితో వచ్చి ఇటీవల సీఎంను కలిసి కరోనా సహాయనిధిని అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సీఎంను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.