సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మాతృభాష నేర్చుకుంటున్న తమన్నా
- చిరంజీవి సినిమాలో రానా దగ్గుబాటి?
- నాగ చైతన్య మరో సినిమా
* ప్రస్తుతం తన మాతృభాష అయిన సింధీని నేర్చుకునే పనిలో వున్నానని అంటోంది అందాలభామ తమన్నా. 'నిజం చెప్పాలంటే నా మాతృభాష సింధీ నాకు సరిగ్గా రాదు. అందుకే ఈ లాక్ డౌన్ సమయంలో తీరికగా వున్నాను కాబట్టి మా అమ్మ దగ్గర సింధీ నేర్చుకుంటున్నాను. త్వరలోనే నా మాతృభాషలో పట్టు తెచ్చుకుంటాను' అని చెప్పింది తమన్నా.
* 'ఆచార్య' తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో చేయనున్నారు. మలయాళ హిట్ సినిమా 'లూసిఫిర్' రీమేక్ గా రూపొందే ఈ చిత్రంలో యంగ్ క్యారెక్టర్ ని రానా దగ్గుబాటి పోషిస్తాడంటూ తాజాగా వార్తలొస్తున్నాయి.
* ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చిత్రాన్ని చేస్తున్న అక్కినేని నాగ చైతన్య ఆ తర్వాత విక్రంకుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' చిత్రాన్ని చేయనున్నాడు. అలాగే అదే సమయంలో మరో చిత్రాన్ని కూడా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తాడు.