వైజాగ్ వాసులను వీడని విషవాయువు భయం .. బాధితుల్లో ఇప్పుడు కొత్త సమస్యలు

  • కమిలిపోతున్న శరీరం
  • చిన్నారుల్లో న్యూమోనియా లక్షణాలు
  • కాలేయ, కిడ్నీ పరీక్షలు చేస్తున్న వైద్యులు
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా విషవాయువు ఇంకా జనాన్ని వెంటాడుతూనే ఉంది. గ్యాస్ పీల్చి అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఇప్పుడు ఇతర సమస్యలు చుట్టుముడుతున్నాయి.

ఈ ఘటనలో 554 మంది బాధితులుగా మిగలగా వీరిలో 52 మంది చిన్నారులే ఉన్నారు. తాజాగా, బాధితుల్లో కొందరికి ఒంటిపై బొబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత శరీరంపై దురద, మంట పుడుతున్నాయి. ఆ తర్వాత చర్మం కమిలిపోయి బొబ్బలు వస్తున్నాయి.

దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు.


More Telugu News