సోమవారం నాటికి ముంబయి చేరుకోనున్న విదేశాల్లోని తెలుగు ప్రజలు
- విదేశాల్లోని భారతీయులను తీసుకువస్తున్న కేంద్రం
- 64 ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు
- ముంబయి నుంచి హైదరాబాద్, గన్నవరంకి తరలింపు
విదేశాల్లో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. 64 విమానాల్లో వారిని స్వదేశానికి రప్పిస్తోంది. ఈ క్రమంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారు సోమవారం నాటికి ప్రత్యేక విమానాల్లో ముంబయి చేరుకోనున్నారు. వారిని ముంబయి నుంచి హైదరాబాదుకు, గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు పెయిడ్ క్వారంటైన్ కు తరలిస్తారు. విదేశాల నుంచి వచ్చేవారి కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో హోటళ్లు, లాడ్జీల్లో 1000 గదులు సిద్ధం చేసింది. 14 రోజుల తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపిస్తారు. అవసరాన్ని బట్టి 28 రోజుల వరకు క్వారంటైన్ పెంచే అవకాశం ఉంది. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.