పీపీఈ కిట్లు తయారుచేసిన భారత నేవీ... భారీ సంఖ్యలో ఉత్పత్తికి ఆమోదం
- కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లకు డిమాండ్
- భారత్ లోనూ పెద్ద ఎత్తున తయారీ
- చవకగా రూపొందిస్తున్న నేవీ
అత్యంత ప్రమాదకరమైన వైరస్ కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో వైద్యులకు, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భారత్ కూడా తొలుత పీపీఈలను దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత దేశీయ సంస్థలు చవకగా పీపీఈలు రూపొందిస్తుండడంతో వీటినే వినియోగిస్తున్నారు. అయినప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరిన్ని పీపీఈలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత నేవీ సొంతంగా పీపీలు తయారుచేసింది. వీటికి కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించింది. భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడమే ఇక తరువాయి.
నేవీ తయారుచేసిన ఈ పీపీఈలకు కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్ మాస్) సంస్థ అన్ని పరీక్షల అనంతరం అనుమతి పత్రం జారీ చేసింది. ప్రస్తుతం వాణిజ్యపరంగా లభ్యమవుతున్న పీపీఈలతో పోల్చితే భారత నావికాదళం తయారుచేసిన పీపీఈ కిట్లు చవక అని, ఇతర పీపీఈలకు భిన్నంగా ఇవి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.