ఈ నెల 15 నుంచి వందేభారత్ మిషన్ రెండో దశ ప్రారంభం!

  • మే 7 నుంచి తొలి దశ అమలు
  • విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు ప్రారంభం
  • రెండో విడతలో మరికొన్ని దేశాల నుంచి తరలింపు
కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వందేభారత్ మిషన్ పేరిట విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. మే 7 నుంచి తొలిదశ అమలవుతోంది. ఇందుకోసం 64 విమానాలు కేటాయించారు. ఇప్పటికే సింగపూర్, బంగ్లాదేశ్, యూఏఈ, బ్రిటన్ తదితర దేశాల నుంచి తరలింపు ప్రక్రియ మొదలైంది. ఇక వందేభారత్ మిషన్ రెండో విడతను ఈ నెల 15 నుంచి షురూ చేయాలని కేంద్రం భావిస్తోంది.

రెండో విడతలో భాగంగా రష్యా, ఉక్రెయిన్, కజకిస్థాన్, థాయిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాల్లోని భారతీయులను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన దేశాల్లోని వారిని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రెండో విడత తరలింపు కోసం ఇప్పటివరకు ఎంబసీల వద్ద 67,833 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 22,470 విద్యార్థులు, 15,815 మంది వలస కార్మికులు ఉన్నారని కేంద్రం వెల్లడించింది.


More Telugu News