కరోనా ప్రభావంతో చిన్నారుల్లో అరుదైన లక్షణాలు!
- అమెరికాలో చిన్నారులకు కూడా సోకుతున్న కరోనా
- కరోనా సోకిన చిన్నారుల్లో శరీర భాగాల వాపు
- కవాసాకి వ్యాధిలోనూ ఇవే తరహా లక్షణాలు!
కరోనా మహమ్మారి అన్ని వయసుల వారికి సోకుతుందన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల అమెరికాలో పదుల సంఖ్యలో చిన్నారులకు కరోనా సోకగా, వారిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. శరీరంలోని కొన్ని భాగాల్లో తీవ్రస్థాయిలో వాపు ఉందని గుర్తించారు. అమెరికా కంటే ముందు యూరప్ లో ఈ లక్షణాలు బయటపడ్డాయి. కరోనా రోగుల్లో జ్వరం, కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు సాధారణ లక్షణాలు కాగా, ఇప్పుడు కొత్తగా వాపు కనిపించడం వైద్య నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అది కూడా చిన్నారుల్లోనే ఈ లక్షణాన్ని గుర్తించామని, ఇటీవల న్యూయార్క్ లో కరోనా బారిన పడిన పిల్లల్లో కొందరికి గుండె భాగంలోనూ వాపు కనిపించిందని, దాంతో వారికి అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని నిపుణులు వివరించారు. అయితే ఇదే తరహా వాపు కవాసాకి వ్యాధిలోనూ కనిపిస్తుందని, అందుకే ఇది కరోనా కారణంగా వచ్చిందా, లేక కవాసాకి వ్యాధితో వచ్చిందా? అనేది తేల్చాల్సి ఉందని అమెరికా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కవాసాకి వ్యాధి ప్రధానంగా చిన్నారుల్లో కనిపిస్తుంది. దీని కారణంగా రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది. అమెరికాలో ప్రతి ఏటా 3 వేల మంది వరకు బాలలు ఈ వ్యాధి బారిన పడుతుంటారని అంచనా. కవాసాకి వ్యాధి కారక లక్షణాలైతే ఐదారు వారాల్లో నయం అవుతాయని, చాలామంది పిల్లలు పూర్తిగా కోలుకుంటారని బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ జేన్ న్యూబర్గర్ వివరించారు. అయితే కరోనా కారణంగా కూడా ఇలాంటి లక్షణాలే కనిపించడం అసాధారణంగా ఉందని, దీన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉందని అన్నారు.