త్యాగరాజ స్వామిపై కమల్ అనుచిత వ్యాఖ్యలు.. సంగీతకారుల ఆగ్రహం!

  • సినిమా అంటే ఛారిటీ కాదు
  • టికెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారం
  • త్యాగరాజులా రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదు
సంగీత త్రిమూర్తులలో ఒకరిగా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని ఉద్దేశించి ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీదీ మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు అంటూ త్యాగరాజును ఉద్దేశించి కమల్ వ్యాఖ్యానించారు. తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్ లో కమల్ పాల్గొన్నారు.

చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా అంటే ఛారిటీ కాదని... టికెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారమని చెప్పారు. త్యాగరాజ స్వామిలా రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది కర్ణాటక సంగీతకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సంగీతకారుడు పాల్ ఘాట్ రామ్ ప్రసాద్ ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు మద్దతుగా ఇప్పటి వరకు 16 వేల మందికి పైగా సంతకాలు చేయడం గమనార్హం.


More Telugu News